చంద్రబాబు రాజకీయమే అంత: బీవీ రాఘవులు మండిపాటు
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీపీఎం సీనియర్ నాయకులు బీవీ రాఘవులు. దేశాన్ని మోదీ అభివృద్ధి చేస్తున్నారన చెప్పడం దారుణమని మండిపడ్డారు. మోదీకి చంద్రబాబు మద్దతివ్వడం హేయమమన్నారు. 14 ఏళ్ల అనుభవం ఉందని చెప్పి… ఎవరినీ గెలిపించొద్దు.. నన్ను మాత్రమే గెలిపించండని అడగడం రాజకీయం కాదా అంటూ చంద్రబాబును రాఘవులు ప్రశ్నించారు. మోదీ అభివృద్ధి చేస్తున్నాడని చెప్పడానికి సిగ్గుపడాలన్నారు. మోదీ దారి దేశాన్ని అమ్ముకుతినడమంటూ దుయ్యబట్టారు. మోదీ ప్రయాణిస్తున్న దారి చాలా మంచి దారి అని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. నీకు సిగ్గు లేదు కాబట్టి… నువ్వు సిగ్గుపడవమో గానీ.. మాకు సిగ్గుందంటూ చంద్రబాబుపై రాఘవులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దేనికి సంకేతమో చంద్రబాబు చెప్పాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన బహిరంగ సభలో సీపీఎం నేత రాఘవులు పాల్గొన్నారు.