Andhra PradeshHome Page Slider

ఆంధ్రలో పథకం పేరు మార్చిన చంద్రబాబు

ఏపీలో కూటమి ప్రభుత్వం పలు పథకాల పేర్లను మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం పేరును కూడా మార్పు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీనిని రాష్ట్రప్రభుత్వం ఏపీ రీసర్వే ప్రాజెక్టుగా మార్చింది. రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. నేడు పలు పాలసీలపై క్యాబినెట్ మీటింగులలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నారు. నూతన మద్యం పాలసీపై కూడా క్యాబినెట్ మీటింగు కొనసాగుతోంది. ఈ పాలసీపై వివిధ రాష్ట్రాలలో మద్యం విధానాలను అధికారులు మంత్రులకు, సీఎంకు వివరిస్తున్నారు.