పోలీసులపై మండిపడ్డ చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వచ్చారు. ఈ సందర్భంలో పోలీసులపై మండిపడ్డారు. పార్టీ ఆఫీసుకు బారికేడ్లు పెట్టడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసేటప్పుడు ఇలాంటివి పెట్టవద్దని, ప్రజలకు తనకు మధ్య అడ్డుగోడలు ఉండకూడదన్నారు. ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని, నిర్దిష్టసమయంలోపలే వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు.