Home Page SliderNational

కొత్త పార్లమెంటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అదేంటంటే ఈ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదు. దీంతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జరగాలని విపక్షాలు డియాండ్ చేస్తున్నాయి. అలా జరగని పక్షంలో తాము ఎవ్వరు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనమని ఇప్పటికే 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. అయితే దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్త పార్లమెంటు భవన నిర్మాణం చారిత్రాత్మకమైందని చంద్రబాబు కొనియాడారు. ఈ భవన నిర్మాణంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. దేశ భవిష్యత్ మార్పులు,చట్టాల రూపకల్పనకు ఈ భవనం వేదిక కావాలన్నారు. అంతేకాకుండా పేదరికం లేని భారత్ ఏర్పాటుకు కొత్త భవనం దిక్సూచి కావాలని చంద్రబాబు ఆకాక్షించారు.