పట్టాలు తప్పిన చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్
చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని గోండా-మాంకాపూర్ సెక్షన్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 10కి పైగా బోగీలు బోల్తా పడ్డాయని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనలో ఏసీ బోగీలు ఎక్కువగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు ప్రమాదం జరిగిన కంగారులో బయటకు రావడానికి ప్రయత్నించడంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 4 ఏసీ కోచ్‌లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.