Home Page SliderLifestyleNational

300 దాటిన చలాన్లు..బైకర్ అరెస్ట్

సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫోటోలు తీసి, చలాన్లు విధిస్తారు పోలీసులు. కానీ ఏకంగా 311 చలాన్లతో రూ.1.60 లక్షల ఫైన్ ఉన్న కర్ణాటక బైక్‌ సంచలనం అయ్యింది. ఈ బైకర్ పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించారు. హెల్మెట్ ధరించకపోవడం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ లాంటి అనేక తప్పులతో చలాన్లు పేరుకుపోయాయి. దీనితో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.