మరోసారి కుంగిన చాక్నవాడి నాలా..
గోషామహల్ నియోజకవర్గంలోని చాక్నవాడి నాలా మరోసారి కుంగింది. దారుసలామ్ రోడ్డు నుంచి చాక్నవాడికి వెళ్లే రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు గతంలో నాలా కుంగడంతో కొత్తది నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో నాలా కుంగడంతో అక్కడే ఉన్న రెడీమిక్స్ వాహనం గుంతలో కూరుకుపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. రెడీమిక్స్ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. నాలా మొత్తం పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.


 
							 
							