Home Page SliderNational

‘హాకీ స్టార్స్ కంటే చాయ్‌వాలానే ఎక్కువా’…

‘భారత్‌లో క్రికెట్ తప్ప హాకీని పట్టించుకోరా?.. హాకీ స్టార్స్ కంటే చాయ్‌వాలానే ఎక్కువా’?..అంటూ ఆవేదన వ్యక్తం చేశారు భారత హాకీ మిడ్ ఫీల్డర్ హార్దిక్ సింగ్. భారతదేశంలో సోషల్ మీడియా స్టార్స్, క్రికెట్ స్టార్లు, సినిమా స్టార్లకే ప్రాధాన్యత ఎక్కువని పేర్కొన్నారు హార్దిక్ సింగ్. ఒక అథ్లెట్‌కు కీర్తి, డబ్బుతో పాటు అభిమానుల గుర్తింపు, అభినందనలు చాలా అవసరం. అవి ఎంతో ఉత్తేజానిస్తాయి అంటూ పేర్కొన్నారు. ఎయిర్‌పోర్టులో తమకు చేదు అనుభవం ఎదురయ్యిందన్నారు. హాకీ టీమ్‌లో హర్మన్ ప్రీత్ సింగ్, మన్‌దీప్ సింగ్, హార్ధిక్ సింగ్ ఎయిర్ పోర్టులో ఉండగా, సోషల్ మీడియా స్టార్ డాలీ చాయ్‌వాలా అక్కడికి చేరుకోవడంతో అక్కడి అభిమానులు అతడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారని, కానీ ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు గెలుచుకున్న తమ టీమ్‌ వంక కన్నెత్తైనా చూడలేదని పేర్కొన్నారు. హర్మన్ ప్రీత్ 150కి పైగా గోల్స్ చేశారు. మన్‌దీప్‌కి 100కి పైగా ఫీల్డ్ గోల్స్ చేశారు. కానీ ఎవ్వరికీ గౌరవం, అభిమానం దక్కలేదని వాపోయారు. డాలీ చాయ్‌వాలా ప్రత్యేక చాయ్‌ను తయారు చేసినందుకు సోషల్ మీడియాలో స్టార్‌గా మారాడు. బిల్‌గేట్స్‌కు కూడా టీ అందించారు.