చైతూ భారీ బడ్జెట్ మూవీ
నాగచైతన్య తన కెరీర్‌లో మొదటిసారిగా ఓ భారీ బడ్జెట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో కృతిశెట్టి జోడిగా ఈ మూవీని తెరకెక్కించనున్నారు. తెలుగు , తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిచనున్నట్టు సమాచారం. అయితే ఇది ఓ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చైతుకి ఇప్పటి వరకూ ఇదే భారీ బడ్జెట్ చిత్రమని మూవీ మేకర్స్ తెలిపారు. దీనిలో చైతు విభిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ ఘాటింగ్ ఈనెల మూడోవారం నుండి ప్రారంభం కానుండగా , ఇళయరాజా , యువన్ శంకర్‌రాజాలు దీనికి సంగీతం అందించనున్నట్టు తెలిసింది.

