చైతన్య, శోభితల పెళ్లి ఎప్పుడంటే..
అక్కినేని నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల పెళ్లికి ముహుర్తం నిర్ణయించారు. అక్కినేని నాగార్జున ప్రకటించిన ప్రకారం డిసెంబర్ మొదటివారంలో వివాహం ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరి ఎంగేజ్‌మెంట్ కొద్దిమంది అతిథుల సమక్షంలో ఆగస్టు 8న జరిగిన సంగతి తెలిసిందే. వారి ప్రీవెడ్డింగ్ వేడుకలు కూడా అక్టోబర్ 21న పసుపు దంచడంతో మొదలయినట్లు శోభితా సోషల్ మీడియాలో తెలియజేశారు. అయితే వీరి వివాహం డిసెంబర్ 4న ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. తమ వివాహ వేడుకల కోసం రాజస్థాన్‌లోని ఒక ప్యాలెస్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.