Home Page SliderTelangana

ఫేస్ బుక్ వీడియోలు చూసి చైన్ స్నాచింగ్

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో కొంతకాలంగా చైన్ స్నాచింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర దొంగ విక్రమ్ ను మహబూబాబాద్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుండి 22.4 తులాల గోల్డ్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ ఇల్లందు రోడ్ ఆర్తి గార్డెన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా బైక్ పై వస్తున్న విక్రమ్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. డిగ్రీ చదువుతున్న టైంలో ఖమ్మంకు చెందిన అంగోత్ విక్రమ్ ఆన్ లైన్ బెట్టింగ్ ఆడటం అలవాటు చేసుకొని, చాలా డబ్బులు పొగొట్టుకున్నాడు. తిరిగి డబ్బులు సంపాదించాలని ఫేస్ బుక్ లో చైన్ స్నాచింగ్ వీడియోలు చూసి చోరీలు చేయడం స్టార్ట్ చేశాడు. వచ్చిన డబ్బులతో బెట్టింగ్ లు ఆడుతూ జల్సాలు చేశాడు. బైక్ నంబర్ తొలగించి, మాస్కు పెట్టుకొని ఒంటిరిగా వేళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ వారి మెడలో నుంచి చైన్లను దొంగిలించి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరిగాడు. ఖమ్మం, మహబూబాబాద్ ఏరియాలో మొత్తం 11 దొంగతనాలు చేశాడు. ఈ క్రమంలో వరుస చైన్ స్నాచింగ్ లపై నిఘా పెట్టిన పోలీసులు నాలుగు స్పెషల్ టీంలుగా ఏర్పడి నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.