కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో చైన్ స్నాచింగ్..
హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. తాజాగా ఈ రోజు తెల్లవారుజామున టెంపుల్ బస్ స్టాప్ వద్ద ఓ ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళాని నీళ్లు ఇవ్వమని స్నాచర్ అడిగాడు. ఇంటి లోపలికి వెళ్ళిన అంజలి అనే మహిళ వెంటనే స్నాచర్ ఇంటి లోపలికి వెళ్లి ఆమె మెడలో నుండి రెండున్నర తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన స్నాచర్ పరార్ అయ్యాడు. లబోదిబోమంటూ కేపీహెచ్ బీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీ వీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.