తిరుమలలో చైన్ స్నాచర్ హల్‌చల్..
తిరుమలలో ఓ చైన్ స్నాచర్ హల్ చల్ చేశాడు. భక్తురాలి మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు చైన్ స్నాచర్. భక్తురాలు కేకలు వేయడంతో చైన్ స్నాచర్‌ను భక్తులు పట్టుకున్నారు. ఘటనా స్థలంలోనే నిందితుడికి చితకబాదారు. చైన్ స్నాచర్‌ను విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటన మాధవ నిలయంలో చోటు చేసుకుంది.


 
							 
							