Home Page SliderNational

“నాపై చాయ్, బిస్కెట్లు”: ఈడీతో దాడికి కుట్ర: మోదీపై రాహుల్ ఆరోపణలు

జులై 29న పార్లమెంట్ చక్రవ్యూహ్ స్పీచ్ తర్వాత తనపై ఈడీతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దాని కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. తనపై దాడి విషయాన్ని ఈడీలో కొందరు అధికారులు వెల్లడించారన్నారు రాహుల్. 2 ఇన్ 1కి పార్లమెంట్‌లో తన స్పీచ్ నచ్చలేదని, ఈడీ డైరెక్టర్ తనపై చాయ్, బిస్కట్లు విసిరేయడం కోసం ఎదురు చూస్తున్నానన్నారు. దేశంలో రైతులు, కార్మికులు, యువతను ప్రధాని నరేంద్ర మోదీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ కమలం ఎత్తులను ఎదుర్కొనేందుకు 21వ శాతబ్దంలో చక్రవ్యూహం సృష్టించబడిందన్నారు. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో అభిమాన్యుడ్ని ఆరుగురు బంధించి అంతమొందించారన్నారు. చక్రవ్యూహం పద్మవ్యూహంలా మారి కమలం సృష్టించబడిందన్నారు. చక్రవ్యూహం కూడా కమలం ఆకారంలో ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ఛాతీపై కమలం ధరించి, దేశంలోని యువతను, రైతులను, మహిళలలను, చిన్న, మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను అభిమన్యుడిలా నెలకొరిగేలా చేస్తున్నాడంటూ దుయ్యబట్టారు. ఆరుగురు కలిసి అభిమన్యుడ్ని నాడు చంపారు. ఇప్పుడు అదే ఆరుగురు నరేంద్రమోదీ, అమిత్ షా, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ… చక్రవ్యూహంతో దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారన్నారు రాహుల్ విమర్శలు గుప్పించారు.

మధ్యతరగతి ప్రజలపై బడ్జెట్‌ కత్తికట్టిందని రాహుల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ‘చక్రవ్యూహ్’ వల్ల కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని విమర్శించారు. మహాభారతం, చక్రవ్యూహంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం చేసిన ప్రకటనలపై బీజేపీ లోక్‌సభ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విరుచుకుపడ్డారు. కొంతమంది యాధృఛితంగా హిందువులైనవారు మహాభారతం గురించిన జ్ఞానం కూడా అదే విధంగా ఉంటుందంటూ దుయ్యబట్టాడు. “కాంగ్రెస్ పార్టీ చక్రవ్యూహాలను” దేశం చాలా చూసిందన్నాడు. దేశాన్ని విభజించిన తొలి చక్రవ్యూహం కాంగ్రెసేనని చెబుతూనే 7 చక్రవ్యూహాలు లెక్కపెట్టి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఠాకూర్ ప్రసంగాన్ని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ఇండియా కూటమి రాజకీయాలను బట్టబయలు చేసిందంటూ విమర్శించారు. తాజాగా రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ తనపై ఈడీతో విరుచుకుపడేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించడంతో ఈ మొత్తం వ్యవహారం… వచ్చే పది రోజులపాటు పార్లమెంట్‌లో రచ్చరచ్చకు కారణమయ్యే అవకాశం ఉంది. ప్రధాని మోదీపైనా, కేంద్రంపైనా రాహుల్ గాంధీ మరింత ఘాటుగా విరుచుకుపడే అవకాశం ఉంది.