ఏపీ, తెలంగాణలలో కేంద్ర విద్యాసంస్థలు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విద్యాప్రమాణాల వృద్ధి చేయడానికి పలు కేంద్రీయ, నవోదయ విద్యాలయాల స్థాపనకు అంగీకారం తెలిపింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయా స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజిగిరి, సూర్యాపేట, సంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని మోదీకి, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

