NationalNews

రైతులకు త్వరలో కేంద్రం డబ్బులు.. ఈకేవైసీ చేసుకోవాలి

రైతులకు ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం త్వరలో 13వ విడత డబ్బులు వేయనుంది. డిసెంబరు చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. భూమి ఉండి అర్హుడైన ప్రతి రైతుకు ఈ పథకం కింద మోదీ సర్కారు ఏడాదికి రూ.6 వేలు ఇవ్వనుంది. రూ.2 వేలు చొప్పున ఏడాదికి మూడు విడతల్లో రైతు ఖాతాలో జమ చేయనుంది. ఇప్పటికే 12 విడతల్లో రైతులకు రూ.24 వేలు అందాయి. కానీ.. ఈకేవైసీ చేసుకోని రైతులకు 12వ విడత డబ్బులు అందలేదు. అందుకే త్వరలో ఈకేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

పీఎం కిసాన్‌ లబ్ధిదారులు ఈకేవైసీని మీసేవా, ఈసేవా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి. బయోమెట్రిక్‌ విధానం ద్వారా సమీప వసుధ స్టేషన్‌లోనూ 15 రూపాయలు చెల్లించి ఈకేవైసీ అప్‌డేట్‌ చేసుకోవచ్చు. దీని కోసం సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం pmkisan-ict@gov.inలో సంప్రదించాలని కేంద్రం తెలిపింది. పీఎం కిసాన్‌ యోజన హెల్ప్‌లైన్‌ నెంబర్లు 15561 లేదా 1800115526 (టోల్‌ ఫ్రీ) లేదా 011-23381092 కు ఫోన్‌ చేయొచ్చని పేర్కొన్నది.