Home Page SliderNational

అయోధ్య శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి హాఫ్ డే సెలవును పాటిస్తామని, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యాలయాలకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటించారు. అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజలను అనుమతించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యే వరకు ఈ వన్‌టైమ్‌ సెలవును పాటిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సన్నాహాలు అత్యంత ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ‘జై శ్రీరామ్’ నినాదాలతో అయోధ్య నగరం మొత్తం పండుగ వాతావరణంలోకి మారిపోయింది. శ్రీరామ్ లల్లా పట్టాభిషేకం కోసం అయోధ్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.