వరద నష్టం అంచనాకు కేంద్ర ప్రభుత్వ బృందం
ఆరుగురు సభ్యుల బృందం నేడు సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో సమావేశంమై వరదనష్టంపై అంచనా వేయనుంది. వరద నష్టాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు సి.ఎస్ శాంతి కుమారి. వరద నష్టం పై వివిధ జిల్లాల్లో సంభవించిన నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను చూశారు. అనంతరం, రెండు బృందాలుగా విడిపోయి సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్‌బాద్ తదితర జిల్లాల్లో క్షేత్ర స్థాయిలోపర్యటించి పరిశీలించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టం పై రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు కేంద్ర బృందం. జరిగిన నష్టాన్ని ఫోటో ఎగ్జిబిషన్ ఫోటోల ద్వారా వివరించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతరావు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు కేంద్ర బృందం. వర్షాలు వరదలు ద్వారా వివిధ శాఖలకు ఏర్పడ్డ నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అధికారులు. సమావేశం అనంతరం జిల్లాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి వెళ్లారు కేంద్ర బృందం.