BusinessHome Page SliderNational

ఓటీటీ సంస్థలకు కేంద్రప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్..

నేటి కాలంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కి విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది. థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకులు తగ్గిపోయారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు, గేమ్ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ అయితే వీటికి ఎలాంటి నియంత్రణ లేదు. అందుకే వాటిలో బోల్డ్ కంటెంట్, డ్రగ్స్, హింస ఎక్కువయిపోయింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శఆఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది. ఇలాంటి కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి కంటెంట్ వల్ల యువత బాగా ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని, కనీస సెన్సార్ ఉండాలని, హెచ్చరికలు లేకుండా అలాంటి సీన్స్ చూపించవద్దని వార్నింగ్ ఇచ్చింది.