Home Page SliderNational

కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ బంగారం,వెండిపై కస్టమ్ ఛార్జీలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బంగారం,వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర ఒకేసారి రూ.2,990/- తగ్గి రూ.70,860కి చేరింది. కాగా 22 క్యారెట్ల 10 గ్రాముల  బంగారం ధర ఏకంగా రూ.2,750/- తగ్గి రూ.64,950గా ఉంది. మరోవైపు వెండి ధర కేజీకి రూ.3500/- తగ్గడంతో రూ.88,000/- వేలకు చేరినట్లు తెలుస్తోంది.