Home Page SliderNational

టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం విచారణ

టెలిగ్రామ్ యాప్ కార్యకలాపాలపై కేంద్రం విచారణ జరుపుతోందని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. గ్యాంబ్లింగ్, మోసాలు, నేరపూరిత కార్యకలాపాలకు టెలిగ్రామ్ సహకరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై దర్యాప్తు జరుపుతున్నారని, దీనిలో అక్రమాలు వెల్లడైతే దీనిపై నిషేధం విధించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే యాప్ ఫౌండర్ దురోవ్‌ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్టు చేశారు.