Home Page SliderTelangana

జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి కేంద్రం షాక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కమిషనర్ ఆమ్రపాలి కాటాను, తెలంగాణ కేడర్‌‌కు కేటాయించాలన్న విజ్ఞప్తిని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. 2010 ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఆమె తెలంగాణ వాసిగా పరిగణించాలని కోరగా, ఖండేకర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం ఇప్పుడు తిరస్కరించింది. GHMC కమిషనర్‌గా పనిచేస్తోన్న ఆమ్రపాలి కాటా, తాను తెలంగాణలో కొనసాగాలే అవకాశమివ్వాలని కోరగా, ఆమె అభ్యర్థనకు కేంద్రం నో చెప్పింది. దీంతో ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి వెళ్లాల్సి ఉంది. 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ఐఏఎస్‌ అధికారుల కేటాయింపునకు ఆమోదం పొందిన మార్గదర్శకాలను, ఆమ్రపాలి సవాలు చేశారు. క్యాడర్‌లను మార్చుకోవాలన్న ఆమె అభ్యర్థన పరిధికి మించినదని ఖండేకర్ కమిటీ పేర్కొంది. UPSC ఫార్మ్‌లో కరస్పాండెన్స్ ప్రయోజనాల కోసం ఆమ్రపాలి కాటా తన “శాశ్వత చిరునామా” విశాఖపట్నం అని పేర్కొన్నారని, తెలంగాణ బయట వ్యక్తి అన్నట్టుగా పేర్కొన్నారని కమిటీ నిర్ధారించింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆమె అభ్యర్థనను ఇప్పటికే తోసిపుచ్చింది. తాజాగా ఆమె వాదనను తిరస్కరించాలని ఖండేకర్ కమిటీ సిఫార్సును కేంద్రం ఆమోదించింది. దీంతో ఆమ్రపాలి కాటా తిరిగి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కి మారాల్సి ఉంటుంది. ఆమె ఇప్పుడేం చేస్తారు. తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. వీరితోపాటు 11 మంది ఐఏఎస్‌లను ఏపీకి వెళ్లాల్సిందిగా కేంద్రం ఆదేశించింది.