విద్యార్థులకు కేంద్రం శుభవార్త
విద్యార్థులకు కేంద్రప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పీఎం విద్యాలక్ష్మి పథకానికి ఆమోదముద్ర వేశారు. ఈ పథకం ద్వారా రూ.7.50 లక్షల రుణాన్ని కేంద్రం హామీతో విద్యార్థులకు మంజూరు చేస్తారు. ఈ రుణంలో 75 శాతం గ్యారంటీ లభిస్తుంది. ఈ పథకం దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు లబ్ది చేకూరుస్తుంది. పీఎం విద్యాలక్ష్మి పథకం ద్వారా ఏటా 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే విద్యార్థికి మరే ఇతరమైన ప్రభుత్వ స్కాలర్‌షిప్ ఉండరాదు. దీనికోసం పీఎం విద్యాలక్ష్మి వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.