పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా స్థిర వైద్య భత్యం పొందుతారని పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అయితే వైద్యభత్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి కానుంది. ఉద్యోగులకు వారి ప్రాథమిక వైద్య అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడేలా ఈ ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ అందిస్తారు. ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థిర వైద్య భత్యం పొందవచ్చు.ఎన్‌పీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ రేటు నెలకు రూ. 1,000గా నిర్ణయించింది. ఈ మొత్తం పాత పెన్షన్ పథకం కింద ఉన్నవారికి సమానం. అయితే పెన్షనర్ జీవించి ఉన్నారని, ప్రయోజనాలను పొందడానికి అర్హులని నిర్ధారించుకోవడానికి పదవీ విరమణ చేసిన కేంద్ర ఉద్యోగులు జీవిత ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి చేశారు. పెన్షనర్ గనుక తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే ఫిక్స్‌డ్ మెడికల్ అలవెన్స్ చెల్లింపు నిలిపివేస్తారు.