కేంద్రం కుట్ర చేస్తోంది.. హరీశ్ రావు మండిపాటు
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఆటంకం కలిగిస్తుందన్నారు ఆర్థిక మంత్రి టి హరీశ్ రావు. రాష్ట్ర ప్రగతికి కేంద్రం అడ్డంకుల మీద అడ్డంకులు కలిగిస్తోందన్నారు. రాష్ట్ర రుణపరిమితిని కేంద్రం అసంబద్ధంగా తగ్గించిందన్నారు. సమైఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం ఆంక్షలు పెడుతోందని మండిపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పక్కకుబెట్టిందన్నారు. కేంద్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. విభజన హామీ చట్టాలను కేంద్రం తుంగలో తొక్కిందన్నారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. విభజన సమస్యలు పరిష్కరించకుండా ఇబ్బందిపెడుతోందన్నారు. ట్రిబ్యునల్ తీర్పుల పేరిట దశాబ్దాల పేరిట జాప్యం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఏపీ నుంచి విద్యుత్ బకాయిలు ఇప్పించమంటే పట్టించుకోవడం లేదన్నారు.

