తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిపి రూ. 3,300 కోట్ల నిధులు విడుదల చేసింది. తక్షణ సహాయ చర్యల కోసం ఈ నిధులు కేటాయించాలని చెప్పింది. వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు నిధులను రీలీజ్ చేసింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, పరిసర ప్రాంతాల్లో జరిగిన విపత్తుపై కేంద్రం చలించింది. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన నష్టంపై ఆరా తీసింది. వరదల వల్ల ఏర్పడ్డ నష్టాల వివరాలు తెలుసుకునేందుకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు.