Home Page SliderNational

వంట నూనెలపై కస్టమ్స్ ట్యాక్స్ తొలగించిన కేంద్రం

 మొన్నటి వరకు దేశంలో వంట నూనెల ధరలు ఆకాశన్నంటిన విషయం తెలిసిందే. అయితే వారం రోజుల క్రితం వంట నూనె ధరల  MRPని కేంద్రం 10% వరకు తగ్గించింది. దీంతో దేశంలోని ప్రజలంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాగా కేంద్రం తాజాగా పొద్దుతిరుగుడు,సోయాబీన్ ముడి నూనెల దిగుమతిపై కస్టమ్స్ ట్యాక్స్‌ను తొలగించింది. అదేవిధంగా అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను మినహయించింది. జూన్ 30 వరకు ఈ ట్యాక్స్‌లను మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఈ మినహాయింపు దిగుమతి చేసుకునేందుకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.