Home Page SliderNational

లద్దాఖ్‌లో కొత్త జిల్లాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌ను అభివృద్ధి చేసే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ ఐదు జిల్లాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ నిర్ణయం వల్ల ప్రతీ ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త జిల్లాల పేర్లను జన్‌స్కర్, డ్రాస్, నుబ్రా, శామ్, చంగ్‌థంగ్‌ అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ లద్దాఖ్ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధికి ఇది ముందడుగు అన్నారు. అక్కడి ప్రజలకు అభినందనలు తెలియజేశారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్ నుండి లద్దాఖ్‌ను వేరు చేసి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ ప్రాంతం కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో ఉంది. శాసనసభ లేకపోవడంతో కేంద్రప్రభుత్వ పాలన కిందకు వస్తుంది. ఇప్పటి వరకూ లేహ్, కార్గిల్ మాత్రమే జిల్లాలుగా ఉండగా, ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు జిల్లాల సంఖ్య ఏడుకు పెరిగింది.