Home Page SliderNational

‘తిరుమల లడ్డూపై కేంద్రం గుస్సా’..ఆరోగ్యమంత్రి హెచ్చరిక

తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూపై అనేక వివాదాలు నెలకొన్నాయి. లడ్డూకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వులు కలిపినట్లు వచ్చిన ఆరోపణలపై కేంద్రం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి జేపీ నడ్డా దీనిపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఆయన సీఎం చంద్రబాబుతో మాట్లాడి కేంద్రం ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహాయపడుతుందని హామీ ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండిసంజయ్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఈ వ్యవహారంలో మత కోణం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కార్మికశాఖ సహాయమంత్రి శోభాకరంద్లాజే కూడా ఈ అంశంపై చాలా తీవ్రంగా స్పందించారు. తిరుమలలో హిందువులు కానివారిని బోర్డ్ ఛైర్మన్‌గా నియమించారు అని విమర్శించారు. దీనివల్లే జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిసిందని ఆరోపించారు. దీనిపై దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహారమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.