Home Page SliderNational

సెన్సార్ కంప్లీటైన ‘ది గోట్’

తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గోట్’ ఇప్పటికే కోలీవుడ్‌లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్లతో మూవీపై హైప్ మరింత పెరిగింది.

సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుకు వచ్చాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు మరింత దగ్గరైంది. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, జయరాం, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా AGS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.