Home Page SliderNational

సెన్సార్ బ్యాన్ – ఓటీటీలోకి Shift!

సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ చేసేందుకే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నసినిమాలు, కాంట్రవర్సీ సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు రెండో దారిగా కనబడుతోంది. దీంతో ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఓ బోల్డ్ మూవీ రానుంది. సెన్సార్ బోర్డ్ బ్యాన్ చేసిన సినిమాను ఆహాలో రిలీజ్ చేసేందుకు ఆ చిత్ర మేకర్స్ రెడీ అయ్యారు. లవ్ అనే పదాన్ని ఇంగ్లీష్‌లో తిరగ రాస్తే ‘ఎవోల్’ (EVOL) అని వస్తుంది. ఇదే టైటిల్‌తో రామ్ వెలగపూడి అనే డైరెక్టర్ ఓ బోల్డ్ కంటెంట్ మూవీని తెరకెక్కించారు. అయితే, ఇందులో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకు అనుమతినివ్వలేదు. దీంతో ఇప్పుడు ఎవోల్ చిత్రాన్ని ఆహాలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15న ఈ ‘ఎవోల్’ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ కూడా చేశారు. రెండు జంటల మధ్య జరిగే కథను బోల్డ్‌గా తెరకెక్కించిన ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే. ఆగస్టు 15 వరకు వెయిట్ చేస్తే మీకే ఆ సినిమా గురించి తెలుస్తుంది.