Breaking NewscrimeHome Page Slider

మాజీ సీఎంకి సీబిఐ సెగ‌

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌పై కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరపగా, తాజాగా మహాదేవ్ బెట్టింగ్‌ యాప్‌ రూ.6,000 కోట్లకు సంబంధించి సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం నుంచి రాయ్‌పుర్‌, భిలాయిలోని ఆయన నివాసాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అలాగే ఓ సీనియర్‌ పోలీసు అధికారి, ఆయన సన్నిహితుల ఇంట్లోనూ ఈ దాడులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేస్తున్న చర్య అని మాజీ సీఎం భూపేశ్ బఘేల్ అన్నారు. దీనిపై స్పందిస్తూ భూపేశ్​ బఘేల్​ ఆఫీస్ ఎక్స్ వేదికగా​ పోస్ట్​ చేసింది.అనుమ‌తి లేకుండా సీబిఐ అత్యుత్సాహం చూపి సోదాలు చేస్తుంద‌ని మండిప‌డుతున్నారు.ఇదంతా బీజెపి కుట్ర‌లో భాగ‌మేన‌ని ,దీనిపై తాము న్యాయ‌పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.