కోల్‌కతా ట్రైనీ డాక్టర్ కేసులో మాజీ ప్రిన్సిపల్‌పై సీబీఐ విచారణ
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్య, మానభంగం కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ ప్రారంభమయ్యింది. ఈ కేసులో అర్జీ కర్ మెడికల్ కాలేజి మాజీ ప్రిన్సిపల్ డా.సందీప్ ఘోష్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విషయం విని ఘటనా స్థలానికి వచ్చిన ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులను మూడు గంటల పాటు సందీప్ ఘోష్ వెయిట్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ప్రశ్నలు అడుగుతూ ఈ ఘటనపై మీ మొదటి రియాక్షన్ ఏంటని ప్రశ్నించినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని కుమార్తెను చూడనివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్మించారు. ముందుగా మీరు ఎవరిని సంప్రదించారని ప్రశ్నించారు.