Andhra PradeshHome Page Slider

పులివెందులలో మాటు వేసిన సీబీఐ అధికారులు

పులివెందుల చేరుకున్న అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి రంగం  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పులివెందుల శివార్లలో మాటువేసారు సీబీఐ అధికారులు. వివేకా హత్యకేసులో అవినాష్‌కు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు చుక్కెదురు కావడంతో ఇక అవినాష్ అరెస్టు ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈరోజు హైకోర్టులో కూడా ఈ విషయంపై విచారణ జరగనుంది. సుప్రీంకోర్టునుండి ఇంకా నిన్నటి తీర్పు ప్రతి రాలేదని తెలిపారు అవినాష్ తరపు లాయర్లు. దీనితో అది లేకుండా విచారణ జరగడం కుదరదని తెలంగాణా హైకోర్టు పేర్కొంది. ఈరోజు వైసీపీ ఆఫీసులో ప్రజాదర్భారు నిర్వహించనున్నారు అవినాష్ రెడ్డి. అభిమానులు అవినాష్ ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే సీబీఐతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.