సీబీఐ దర్యాప్తులకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదు
సీబీఐ దర్యాప్తులకు రాష్ట్రాల అనుమతి అవసరం లేదంటూ ఒక కొత్త చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేస్తోంది. సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యాన్ని నివారించాలని కోరుతున్నారు. 1946నాటి దిల్లీ ప్రత్యేక పోలీసు సంస్థ చట్టం ప్రకారం సీబీఐ దర్యాప్తుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తప్పనిసరి. కానీ జాతీయ భద్రతకు, దేశ సమగ్రతకు ప్రమాదం వాటిల్లే సందర్భాలలో రాష్ట్రాల అనుమతితో పని లేకుండా కొత్త చట్టాన్ని చేయమని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచిస్తోంది. అదే విధంగా ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వాలు వివక్షకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

