Home Page SliderTelangana

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ సిద్ధమా..? కాంగ్రెస్‌కు బీజేపీ సవాల్

కాళేశ్వరం ప్రాజెక్టు స్కాంలో సీబీఐ విచారణకు ఆదేశించేందుకు సిద్ధమా..? అంటూ సవాల్ విసిరారు బీజేపీ తెలంగాణ చీఫ్ జి కిషన్ రెడ్డి. సీబీఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరానికి ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా..? అంటూ ఈయన విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై విచారణకు మీనమేశాలు లెక్కించడం వెనుక మతలబేంటోనని ఆయన విమర్శించారు.