11 మంది బీఆర్ఎస్ నేతలపై ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ దాడులు
బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్ . 11 మంది నాయకులపై ఈడీని, సీబీఐని పంపించారని చెప్పారు. రాజకీయంగా బురదజల్లి, కేసీఆర్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. కవితకు ఈడీ సమన్లు కాదు.. మోడీ సమన్లన్నారు. తెలంగాణలో మోదీ సమన్లకు భయపడేవారులేరన్నారు. బీజేపీ నేతలపై పెట్టిన కేసులేంటో ఈడీ, సీబీఐ చూపించగలవా అన్నారు కేటీఆర్. కర్నాటకలో అత్యంత అవినీతి ప్రభుత్వమని దేశం కోడైకూస్తోందన్నారు. అదానీకి అనుగుణంగా మోదీ పాలన సాగుతోందన్నారు. బీజేపీ నిజస్వరూపాన్ని నగ్నంగా చూపిస్తామన్నారు కేటీఆర్. రాజకీయ కక్ష సాధింపును రాజకీయంగానే ఎదుర్కొంటామన్నారు. దేశంలో న్యాయవ్యవస్థపై నమ్మకముందన్నారు కేటీఆర్. బీజేపీ మౌత్ పీసెస్‌గా ఉన్న చిల్లర సంస్థలను ఎండగడతామన్నారు. సుజనా చౌదరిపై 6 వేల కోట్ల కేసు ఏమైందన్నారు. 9 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కుప్పకూల్చారన్నారు. మోదీ-అదానీ చీకటి స్నేహం గురించి అందరికీ తెలుసునన్నారు. మాఫీయాను నడిపినట్టు మీడియాను నడిపిస్తున్నారన్నారు. యాజమాన్యాల గొంతు నొక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ కవిత చట్టాన్ని గౌరవిస్తారన్నారు. విచారణను ఎదుర్కొంటారన్నారు. విచారణను ఎదుర్కొనే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందన్నారు. అదానీ, మోదీ బినామీ అని చెబుతున్నా.. ఎందుకు మాట్లారన్నారు. కవిత తర్వాత కూడా మా పార్టీ నేతలపై దాడులు జరుగుతాయన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ మంత్రులు, మా లీడర్లపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నాయన్నారు. రాజకీయ వేధింపులను రాజకీయంగా ఎదుర్కొంటామన్నారు.