సినిమా తరహాలో పశువులు రవాణా..
పశువులను తరలించడానికి సినిమా రేంజ్ లో ప్లాన్ చేశారు… డీసీఎం పైన టమోటా ట్రేలు పెట్టీ కింద పశువులను తరలిస్తున్నారు. తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద పోలీసులు వాహనాన్ని తనకి చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.. 17 పశువులను రక్షించి గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

