Andhra PradeshHome Page SliderTelangana

తెలంగాణలో కుల రాజకీయం తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కులాల సంఘర్షణ దేశ వ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేస్తుందని మనం చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం. అయితే ఆ కులాలు ఎవరికి ఓటేస్తాయి? ఎందుకు ఓటేస్తాయన్నది మనందరికీ తెలిసిన విషయమే! ఆయా సమస్యలు వచ్చినప్పుడు తమకు పరిష్కారాలు చూపించే వారు గెలవాలని వారందరూ భావిస్తారు. అదేవిధంగా ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కొక్కరికి మద్దతిస్తూ ఉంటారు. ఏ కులం కూడా ఒక పార్టీకి, ఒక వర్గానికి మద్దతిస్తుందని చెప్పడానికి ఏమీ లేదు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే దేశంలో అలాంటి పరిస్థితి కారణమయ్యాయి. కానీ మెజార్టీ పార్టీలు కులాలను నమ్ముకుని రాజకీయాలు చేయడం ఎప్పుడో మానేశాయి. ఇవన్నీ రాజకీయాల్లో వర్కౌట్ కావని గ్రహించాయి. అందుకే ఓబీసీలు, ఎస్సీ రాజకీయాలంటూ తాపత్రయపడుతున్నాయ్. అందుకోసమే కులం పరోక్షంగా ఉన్నా ప్రత్యక్షంగా కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నడుమ ప్రత్యేక ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సాక్షిగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయానికి కమ్మ, కాపు కులం ఎలాంటి కల్లోలం రేపుతుందన్నది చూడాలి