హైదరాబాద్ శివారులో క్యాసినో గుట్ఠు రట్టు.. 64 మంది అరెస్టు..
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో రాజేంద్రనగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ దాడుల్లో 64 మందిని అరెస్ట్ చేశారు. 30 లక్షల నగదులో పాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసునూ, కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. కోళ్ల పందాలు నిర్వహిస్తున్న భూపతి రాజు శివకుమార్‌ను అరెస్ట్ చేశారు.