600 మందిపై కేసులు 147 మంది అరెస్ట్
చంద్రబాబు మోసాల గురించి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి తెలిసినంతంగా మరెరికి తెలియదని టిటిడి బోర్డు మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.చంద్రబాబు చేసిన మోసాలంటూ ఆయన శనివారం ప్రెస్ మీట్ నిర్వహించి …గతంలో దగ్గుబాటు రచించి,ప్రచురించిన బాబు మోసాల పుస్తకంలోని కొన్ని ప్యారాలను చదివి ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.రూ.14లక్షల కోట్లు అప్పు చేశారని నిన్న మొన్నటి దాకా చెప్పి …తాజాగా బడ్జెట్‌లో మాత్రం రూ.9లక్షల కోట్లే చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 600 మందిపై కేసులు పెట్టారని వీరిలో 147 మందిని అరెస్ట్ చేసి జైళ్లకు పంపారన్నారు.ఇలాంటి నియంతృత్వ పాలన స్వాతంత్య్రం సిద్దించిన నాటి నుంచి చూడలేదన్నారు.చంద్రబాబు గురించి ఇంకా తెలియాలంటే దగ్గుబాగు రచించిన పుస్తకాన్ని చదువుకుంటే అన్నీ విషయాలు తెలుస్తాయని, ఎవరు మోసగాళ్లో,ఎవరు దొంగలో తేలుతుందని ఆయన చురకలంటించారు.

