యూట్యూబర్ హర్షపై కేసు నమోదు
హైదరాబాద్ లో ఓ యూట్యూబర్ హల్ చల్ చేశాడు. కేపీహెచ్ బి లో ట్రాఫిక్ మధ్యలో వచ్చి యూట్యూబర్ గాల్లోకి డబ్బులు విసిరాడు. కరెన్సీ నోట్లను గాల్లోకి ఎగేరేస్తూ బైక్ పై స్టంట్లు చేశాడు. ఆ నోట్ల కోసం జనం ఎగబడ్డారు. దీంతో విపరీతమైన ట్రాఫిక్ ఏర్పడింది. వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారు. స్టంట్లు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ట్యూబర్ హర్షపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు యూట్యూబర్ హర్షపై కేసు నమోదు చేశారు. డబ్బులు విసిరేస్తూ రోడ్లపై హల్ చల్ చేసిన హర్ష అనే యువకుడి మీద సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు హర్షపై కేసు నమోదు చేశారు.