టాలీవుడ్ హీరోపై కేసు నమోదు..
టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లే క్రమంలో రాంగ్ రూట్‌లో వెళ్తున్నట్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీస్ ఆయనను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ జర్నలిస్టుల కాలనీలో ఆయన నివాసానికి వెళుతుండగా అపసవ్య దశలో కారు నడిపారు. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, దీనితో వారు కేసు నమోదు చేశారని సమాచారం.

