Home Page SliderNational

కేరళలో పుష్ప విలన్‌పై కేసు నమోదు

ప్రముఖ మళయాళ నటుడు,పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్‌పై కేరళలో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా ఆయన సొంత ప్రొడక్షన్‌లో నటిస్తోన్న సినిమా “పెయిన్కిలీ” షూటింగ్‌ను ఎర్నాకులం ప్రభుత్వాస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చిత్రీకరించారు. అయితే ఆ సమయంలో అందులోకి వెళ్లేందుకు రోగులను అనుమతించేదు. దీంతో అక్కడి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా ఈ విషయాన్ని కేరళ మానవ హక్కుల సంఘం సుమోటాగా తీసుకుని..నిర్మాత ఫహాద్ ఫాజిల్‌పై కేసు నమోదు చేసింది. అయితే ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప” సినిమాలో విలన్‌గా నటించి తెలుగులోను మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.