పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులోని మధురైలో కేసు నమోదైంది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కళ్యాణ్ ఉద్దేశ పూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మధురై కమిషనరేట్ లో వాంజినాథన్ అనే లాయర్ కంప్లెయింట్ చేశాడు. సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను పవన్ వక్రీకరించాడని తెలిపాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.