బేబిలాన్ పబ్ యాజమాన్యంపై కేసు నమోదు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బేబిలాన్ పబ్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనల్, తల్లి, చెల్లితో పబ్‌కు వెళ్లగా,తాము ఆర్డర్ చేయని డ్రింక్స్‌కు బిల్లు వేసి డబ్బులు డిమాండ్ చేశారు. సిబ్బందిని నిలదీయడంతో లైట్స్ ఆపి తమపై దాడి చేశారని మీనల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు బేబిలాన్ పబ్ సిబ్బందిపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

