Home Page SliderTelanganatelangana,

కేటీఆర్‌పై కేసు..తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

మాజీ మంత్రి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై ఫార్ములా ఈ కార్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద భారీగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు తరలి వచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తెలంగాణ భవన్‌ను చుట్టుముట్టారు. మరోవైపు బంజారా హిల్స్  ఏసీబీ ఆఫీసులో ఏసీబీ అధికారులు సమావేశమై ఈ కేసు విషయంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ స్థాయి వ్యక్తితో విచారణను జరిపిస్తారని సమాచారం.