కేటీఆర్ పై కేసు
తెలంగాణలోని నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో ఈ నెల 21న జరిగిన పదవ తరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులే ప్రశ్నాపత్రం లీక్ చేశారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్, కొణతం దిలీప్ కుమార్లు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేశారని వారిపై మంగళ వారం రాత్రి నకిరేకల్ మున్సిపల్ చైర్ పర్సన్ రజిత తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేటీఆర్, క్రిశాంక్, దిలీప్ లపై 353/1సీ, 353/2 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.