రఘురామ ఫిర్యాదుపై మాజీ సీఐడీ చీఫ్‌పై కేసు
టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మాజీ సీఐడీ చీఫ్‌పై కేసు నమోదు చేశారు. గతంలో వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్‌గా ఉన్న ఐపీసీ అధికారి సునీల్ కుమార్ తనపై హత్యాయత్నం చేశారని రఘురామ ఆరోపణలు చేశారు. గతంలో తనను కస్టడీలోకి తీసుకుని కొట్టడంతో పాటు ప్రాణాపాయ స్థితిని కల్పించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఎంపీగా ఉన్న తనను వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు సీఐడీ కక్షపూరితంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. వీరితో పాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్ నాయక్, మాజీ డీఎస్పీ పాల్‌పైన కూడా కేసులు నమోదు చేశారు.

