Andhra Pradeshhome page slider

కూలీలపైకి దూసుకెళ్లిన కారు..

ఒక్కసారిగా అతివేగంతో ఓ కారు కూలీలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట చెరువు బజార్ లో చోటు చేసుకుంది. చెరువు బజార్ లో ఉన్న అడ్డా కూలీలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలు. కారు డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన అనంతరం కారు డ్రైవర్ పరిటాల భాస్కర్ పరారయ్యాడు.